యాంకర్ గా అలరించనున్న సానియా

November 21, 2014 | 05:40 PM | 33 Views
ప్రింట్ కామెంట్

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ క్రేజే తెలంగాణ రాష్ర్టానికి బ్రాండ్ అంబాసిడర్ ను చేసింది. అంతేకాదు త్వరలో జేమ్స్ బాండ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించాల్సిందిగా సానియాకు పిలుపు వచ్చిందన్న వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలీదు కానీ, ఇప్పుడీ టెన్నిస్ స్టార్ యాంకర్ అవతారం మాత్రం ఎత్తబోతుంది. ‘స్కూల్ ఆఫ్ బాండింగ్’ పేరిట సోనీ పిక్స్ ఛానెల్ లో ప్రసారం కాబోయే కార్యక్రమానికి సానియా మీర్జా వ్యాఖ్యతగా వ్యవహరించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టీజర్ ను ఇటీవలె విడుదల చేశారు. 60 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో సానియా అద్భుతంగా నటించిందని విమర్శకులు సైతం అంటున్నారు. మరి త్వరలో బుల్లితెరపై కనువిందు చేయనున్న సానియా ఆపై సిల్వర్ స్ర్కీన్ పై దర్శనం ఇవ్వాలని కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ