ఇద్దరు స్టార్లను మట్టికరిపించిన కమెడియన్

December 11, 2015 | 05:52 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Santhanam_in_Forbes_India_Celebrity_100_niharonline

ప్రతీ ఏడూ లాగే ఫోర్బ్స్ ఇండియా ఈ సంవత్సరం కూడా టాప్ 100 సెలబ్రిటీల జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో సౌత్ తరపును, ముఖ్యంగా కోలీవుడ్ తరపున కొన్ని అద్భుతాలు చోటుచేసుకున్నాయి. మాములుగా ప్రతీ యేడాది జాబితాలో ర్యాంకులు సొంతం చేసుకునే ఇదయదళపతి విజయ్, తల అజిత్ లు ఈ యేడు జాబితాలో చోటు దక్కించుకోకపోవటం విశేషం. గతేడాది జాబితాలో విజయ్ కి 31 వ ర్యాంకు సోంతం కాగా, అజిత్ 41 వస్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ, ఈ సంవత్సరం జాబితాలో వారిద్దరి పేర్లు చోటుచేసుకోకపోవటం విశేషం.

                              ఫోర్బ్స్ వారికున్న పేరు, వారు తీసుకునే రెమ్యునరేషన్, ఈ ఏడాది కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియాల్లో వారి పాపులారిటీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను తయారు చేస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే అజిత్ రెండు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాగా, అజిత్ పులిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోనీ రెమ్యునరేషన్ తీసుకోలేదా వారివి ఎలాగూ భారీగానే ఉంటాయి. అయినప్పటికీ వారి పేర్లు గల్లంతు కావటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక జాబితాలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టార్ కమెడియన్ సంతానం ఈ జాబితాలో చోటు సంపాదించుకోవటం. నేనే అంబానీ, ఓకే ఓకే, రాజారాణి తదితర చిత్రాలతో సంతానం తెలుగు వారికి బాగా పరిచయం.  ఈ జాబితాలో 52వ స్థానంలో ఉన్న సంతానం 45 కోట్లు వార్షిక ఆదాయంగా ఫోర్బ్స్ పేర్కొనటం విశేషం.

ఇంకా ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 257 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా, కండవీరుడు సల్మాన్ 202 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అమితాబ్ బచ్చన్ కి మూడో స్థానం దక్కింది. ఇక సౌత్ విషయానికొస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 51.5 కోట్ల ఆదాయంతో 36వ స్థానంలో నిలిచాడు. ఇక మహేష్ తర్వాత కోలీవుడ్ నటుడు ధనుష్ 42 కోట్ల వార్షికాదాయంతో 37 వస్థానంలో నిలిచాడు. అయితే ఆయన మామ రజనీకాంత్ ఆదాయం 25 కోట్లు కాగా, ర్యాంకు 69కి పడిపోవటం విశేషం.  బాహుబలితో ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన రాజమౌళి 26 కోట్లు సంపాదనతో 72వ ర్యాంక్ లో ఉండగా,  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 24 కోట్లు ఆర్జించి 77వ స్థానంలో నిలిచాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ