తెరకు పరిచయం కావటానికి, చాన్స్ ల కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు నటీనటులు. నటన కంటే గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న ఈ రోజుల్లో (అని ఫీలయిపోయి) ఎక్స్ పోజింగ్ లు, ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తారు. అదే ఊపులో బాగా ప్రమోట్ చేసుకుంటారు. వచ్చిన అవకాశాన్ని దేని వదలకుండా చాన్స్ ల కోసం ప్రయత్నిస్తుంటారు. అదే కోవలోకి ఇప్పుడు మరో నటి వచ్చి చేరింది.
బాలీవుడ్ లో అరడజను పైగా యాడ్ లలో, ఒకటి రెండు టీవీ షోల్లో సందడి చెయ్యటంతోపాటు ఈ ఏడాది కామోషియన్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సప్న పబ్బీ. ఆ చిత్రం పెద్దగా కలిసి రాకపోవటంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక నటన కన్నా గ్లామర్ చూపించాలని డిసైడ్ అయిన సప్న అడపాదడపా ఫోటో షూట్ లతో సందడి చేసింది. ఇక లాభం లేదనుకుందో ఏమో ఈ మధ్య మరీ రెచ్చిపోతుంది. మాన్స్ వరల్డ్ మాగ్జైన్ కోసం తెగించి ఫోటో షూట్ చేసింది. అది చూసిన వారంతా ఔరా సప్న మరీ ఇంత హాటా అని ముక్కున వేలేసుకున్నారు. ఎక్స్ పోజింగ్ మరీ అంత ఎక్కువైతే కుర్రకారు తట్టుకోలేరు బాబోయ్...