విలక్షణ నటుడి నుంచి చాలానే నేర్చుకోవాలి

April 26, 2016 | 01:22 PM | 3 Views
ప్రింట్ కామెంట్
suriya-ready-to-act-free-for-nadigar-sangham-niharonline

సినిమాల్లో స్టార్ డమ్ అనుభవిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా అరుదు. అయితే ఒకానోక స్టేజీకి చేరాక వారు ఆ విషయాలను పెద్దగా పట్టించుకునే అవకాశం అస్సలు ఉండబోదు. దీనికి వారు చెప్పే కారణం సింపుల్ గా బిజీ అని. అయితే రెండు భాషల్లో స్టార్ హీరోగా చెలామణి అవుతున్న సూర్య మాత్రం ఇందుకు మినహాయింపు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంటాడు. మొన్నామధ్య వైజాగ్ హుదూద్ సమయంలో తెలుగు హీరోలు సైతం సిగ్గుపడేలా పెద్ద మొత్తంలో తన వంతు సాయం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆపై వరదలతో అతలాకుతలం అయిన చెన్నైని ఆదుకున్న విధానం కూడా మనం చూశాం. తన ఇంట్లో బాధితులకు ఆశ్రయం ఇవ్వటంతోపాటు, తన ఫౌండేషన్ ‘అగరం’ తరపును నాలుగు ఊళ్లను దత్తత తీసుకుని అక్కడి పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పించటంతోపాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.  

                                ఇక ఇప్పుడు నదిగర్ సంఘం కళాకారులను ఆదుకునేందుకు వరుసగా ఈవెంట్లను నిర్వహిస్తుంది. ఈ మధ్యే క్రికెట్ మ్యాచ్ నిర్వహించగా, ఇప్పుడు డబుల్ బెడ్ రూం ప్లాట్లు, షాపింగ్ మాల్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికోసం సినిమాలు తీయాలని నిర్ణయించగా, ఫ్రీగా నటించేందుకు కార్తీ, విశాల్ లు ముందుకు వచ్చారు. ఇందుకు తాను కూడా సిద్ధమేనని సూర్య కూడ ప్రకటించాడు. కోలీవుడ్ మార్కెట్ పరంగా చూసుకుంటే టాప్ 5 లో సూర్య ఒకడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. అలాంటిది ఓ మంచి ఉద్దేశం కోసం కోట్ల రూపాయలను వదులుకునేందుకు ముందుకు వచ్చిన సూర్యని చూసి స్టార్ హీరోలు చాలానే నేర్చుకోవాలి సుమా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ