మేరీ కోమ్ ద్వారా ఆకట్టుకున్న బాలీవుడ్ డైరక్టర్ ఒముంగ్ కుమార్ మరో సెన్సెషన్ కి రెడీ అయిపోయాడు. పాకిస్థాన్ లో 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించి, దారుణంగా హత్యకు గురైన సరబ్ జిత్ సింగ్ ఇతివృత్తంపై సినిమా తీసి మన ముందుకు రాబోతున్నాడు. ఉగ్రవాది నెపంతో పాక్ జైల్లో బందీగా ఉన్న సరబ్ జిత్ కోసం ఆయన సోదరి దల్బీర్ కౌర్ జరిపిన పోరాటం ఆధారంగా చేసుకుని ఒముంగ్ ఈ కథను తెరకెక్కించాడు.
ఇందులో సరబ్ జిత్ గా రణ్ దీప్ నటిస్తుండగా, దల్బీర్ పాత్రలో ఐశ్వర్య రాయ్ నటించనుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే... ముందు సరదాగా గడిపే సరబ్ జిత్ అనుకోని పరిస్థితుల్లో పాక్ జైల్లో పడతాడు. ఇక అక్కడి నుంచి తన సోదరుడిని వెతుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుంటుంది దల్బీర్. రియల్ కథ కావటంతో అందులోని ఎమోషన్, ఫీల్ ను అధ్బుతంగా క్యారీ చేసినట్లు అనిపిస్తోంది. ఇక సరబ్ జిత్ పాత్ర కోసం ఏకంగా 28 కేజీలు తగ్గి పెషంట్ లా మారిపోయాడు రణదీప్ హుడా. పాక్ జైల్లో అతడు ఎదుర్కున్న దీన పరిస్థితులను ట్రైలర్ లో కాస్త చూపించారు. 23 ఏళ్ల ఓ సోదరి పోరాటం, దల్బీర్ పాత్రలో ఐశ్వర్య రాయ్ నటన పీక్స్ లో ఉంటుందనే అనిపిస్తోంది. చివర్లో మన దేశం గురించి ఆమె చెప్పే డైలాగ్ అదిరింది. ఈ ట్రైలర్ చూశాక అనిపించింది ఏంటంటే ఐష్ లో యాక్టింగ్ పస ఇంకా ఏ మాత్రం తగ్గలేదని. మొత్తానికి సరబ్ జిత్ తో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమైపోతున్నాడు ఒముంగ్. రిచా చద్దా, దర్శన్ కుమార్ మిగతా పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 29న విడుదల కానుంది.