పోలీసోడి దెబ్బకి ఇరకాటంలో దిల్ రాజు

April 14, 2016 | 10:50 AM | 4 Views
ప్రింట్ కామెంట్
dilraju-policeodu-legal-notice-title-niharonline

మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు లీగల్ నోటీసులు అందాయి. తమిళంలో విజయ్ నటించిన తెరీ చిత్రాన్ని తెలుగులో పోలీసోడు పేరుతో దిల్ రాజు అనువదిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 15 న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. రాజా రాణి చిత్ర ఫేం అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లు. కథపై నమ్మకంతోపాటు, అందులోని స్టార్లకు తెలుగులో మంచి క్రేజ్ ఉండటంతో తెలుగులోనూ భారీగా విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు కూడా చేశారు.

                                 అయితే పోలీసుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా సదరు చిత్రం టైటిల్ ఉందని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం ఆరోపించింది. వెనువెంటనే రంగంలోకి దిగిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాదు శాఖ అధ్యక్షుడు దిల్ రాజుకు లీగల్ నోటీసులు జారీ చేశారు.  సదరు చిత్రం టైటిల్ ను మార్చాల్సిందేనని వారు ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు. సినిమా విడుదలకు ముందు రోజే ఇలా నోటీసులు రావటంతో దిల్ రాజు ఏం చేస్తారా అని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ