తన కల ఫలించినందుకు కట్టప్ప ఫుల్ ఖుష్...

July 18, 2015 | 12:56 PM | 4 Views
ప్రింట్ కామెంట్
kattappa_satyaraj_niharonline

ప్రతి వారికీ ఏవో ఒక కోరికలు ఉంటూనే ఉంటాయి. అది నటులకైతే మరీ ఎక్కువగా... అన్ని క్యారెక్టర్లలోనూ తమను తాము నిరూపించుకోవాలని ఉబలాటపడడం సహజం... 1960-70 ల్లో రాజుల కథలతో అనేక సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, కాంతారావు, రాజనాల తదితరులు కత్తి యుద్ధాల సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఆ యుద్ధాలు చూసిన తరువాతి తరం హీరోలకు సహజంగా అలా తామూ ఓ సినిమా చేయాలని అనుకుంటుంటారు కదా... అలా కట్టప్పకూ (సత్యరాజ్) కత్తియుద్ధాలుండే ఓ జానపద చిత్రంలో నటించాలనిపించిందట.  తన మనుసలోని మాట ఇప్పుడు ఇలా బయట పెట్టారాయన. ‘‘కొన్ని పనులు ఎప్పుడో చేయాలనుకుంటాం.. కాని అప్పుడు కుదరదు.. ఎప్పుడో మనం అనుకోనప్పుడు కుదురుతుంది.. మనం బాగా వర్రీ అవుతున్నా కూడా ఆ పనులు ఎప్పుడు జరుగుతాయో అప్పుడే జరుగుతాయి కాని.. మనం అనుకున్నప్పుడు మాత్రం జరగవు’’ అంటూ వేదాంతంలా చెప్పుకొచ్చారు... ఇంతకీ ఆయన అలా చెప్పడంలోని అర్థం ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా... కట్టప్పలాంటి క్యారెక్టర్ ఆయన 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు చేయాలనుకున్నాడట. అది ఇప్పుడు నెరవేరిందంటూ చెప్పుకొచ్చాడు. తను 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కత్తి యుద్దాలూ గట్రా నేర్చుకున్నాడట. అప్పట్లో ఇలాంటి మైథలాజికల్ సినిమాలు చేయాలని చాలా కలలు కన్నాడట. కాని ఆ కోరిక ఇప్పుడు అంటే 60లో పడ్డాక రాజమౌళి తీర్చేశాడట.  ఈ వయసులో ఇప్పుడు కత్తియుద్దం చేయడం చాలా గర్వంగా ఉందని చెప్పుకుంటున్నాడీ తమిళ హీరో. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ