శ్రీమంతుడు సినిమాలో మహేష్ ఓ బిలియనీర్. అతనో పెద్ద పాలెస్ లో ఉండాలి. ఈ కారణం వల్ల అలాంటి పెద్ద ఇంటి కోసం దేశ దేశాల్లో వెతికారట ఈ చిత్రం బృందం.
‘‘మేం ఈ చిత్రం కోసం పెద్ద పెద్ద భవంతులను చాలా వెతికాం. ఈ భవంతుల కోసం స్పెయిన్, ఫ్రాన్స్, సింగపూర్, థాయ్ లాండ్ లో కూడా వెతికాం... ఎక్కడా మాకు అనుకూలమైన ప్యాలెస్ దొరకలేదు. చివరిగా ఒక భవంతి మలేషియాలో దొరికింది. ఈ భవంతి మేం ఊహించినట్టు, మా షూటింగ్ కు అనువైనదిగా ఉండడంతో దీన్ని ఎంచుకున్నాం’’ అన్నాడు సినిమాటోగ్రాఫర్ ఆర్.మైధీ, ఈ ప్యాలెస్ చూడాలంటే మరో ఆరు రోజులు వెయిట్ చేయాల్సిందే. శ్రీమంతుడు కథ లో ఏదో కొత్త దనం కనిపిస్తుండడంతో ఇప్పటికే మహేష్ అభిమానులతో పాటు సామాన్య జనం కూడా శ్రీమంతుడేంటి సైకిల్ తొక్కడమేంటి? ఊరిని దత్తత తీసుకోవడం ఏమిటని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.