సినిమా పరిశ్రమలో అవార్డులకు తక్కువేం లేదు. ఉత్తమ అవార్డులతో పాటు, చెత్త పెర్ఫార్మెన్స్ లకు కూడా అవార్డులు అవి ‘గోల్డెన్ కేలా అవార్డు’లు. వీటిని కూడా ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నారు. వీటిని అందుకోడానికి ఆయా కేటగిరీ నటులు ఈ ఫంక్షన్ కు అటెండ్ అవుతారో లేదో మరీ. 2009లో జతిన్ వర్మ ఈ ‘గోల్డెన్ కేలా' అవార్డులను పరిచయం చేశారు. ప్రతి యేటా ఈ చెత్త అవార్డులకు నామినేషన్లు తీసుకుంటారు. ఈ వేడుకలో వరస్ట్ అవార్డు అందుకునేవారెవరంటే... అంటూ గోల్డెన్ కేలా అవార్డును అనౌన్స్ చేస్తారు. ఈ ఇయర్ కూడా గోల్డెన్ కేలా అవార్డుకు అన్ని విభాగాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చెత్త పెర్ఫార్మెన్స్ తో అవార్డులు అందుకున్న వారు. చెత్త యాక్టర్: అర్జున్ కపూర్ "గుండే" చెత్త హీరోయిన్ : సోనాక్షి సిన్హా (యాక్షన్ జాక్షన్, లింగా, హాలిడే) చెత్త సినిమా హమ్ షకల్స్, చెత్త దర్శకుడు: ప్రభుదేవా "యాక్షన్ జాక్షన్" చెత్త తెరంగేట్రం: టైగర్ ష్రాఫ్ (హీరో పంతి), చెత్త పాట: బ్లూ హై పానీ పానీ "యారియాన్", చాలు బాబూ చాలా ఎక్కువైంది అవార్డ్: యో యో హనీ సింగ్, వరస్ట్ లిరిక్స్: షబ్బీర్ అహ్మద్ "ఐస్ క్రీమ్"... "ది ఎక్స్ ఫోజ్ మూవీ", వరస్ట్ సీక్వెల్ లేదా రీమేక్: హృతిక్ రోషన్ నటించిన "బ్యాంగ్ బ్యాంగ్", ఇంకా ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అవార్డు: సోనామ్ కపూర్, అర్థం పర్థం లేని వివాదాస్పద మూవీ: "పికె", జద్దూ అవార్డు: హ్యాపీ న్యూఇయర్ చిత్రంలో ఏలియాన్ పాత్ర చేసిన షారుక్ ఖాన్ అందుకున్నారు. దారా సింగ్ అవార్డ్ ఫర్ వరస్ట్ అసెంట్: ప్రయాంక చోప్రా (మేరీ కోమ్), కూనీ డ్రాకులా అవార్డ్: "6-5=2" మూవీ.