నట సింహ బాలకృష్ణ 100వ సినిమా కోసం నందమూరి అభిమానులే కాదు, యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా 99 డిక్టేటర్ సక్సెస్ లో ఉన్న బాలయ్య త్వరలో వందో చిత్రాన్ని మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి రోజుకో వార్త గాల్లో షికార్లు చేస్తుంది. మొన్నటిదాకా బోయపాటి శీను పేరు వినిపించగా, నిన్నటి వరకు సింగీతం శ్రీనివాసరావు పేరు వినిపించింది. బోయపాటి పూర్తి స్క్ట్రిప్ట్ రెడీ చేయకపోవటం, ఆపై బెల్లంకొండ శీనుతో ఓ చిత్రం కమిట్ కావటంతో అది కాస్త పక్కన పెట్టినట్లు అయ్యింది. ఇక సింగీతం దర్శకత్వంలో ఆదిత్య 999 బాలయ్య సెంచరీ చిత్రమని అంతా కన్ఫర్మ్ అయ్యారు. ఇక ఇప్పడు మరో యువదర్శకుడి పేరు తెరపై వినిపిస్తుంద.
పటాస్ తో సాలిడ్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది. అలాగే, ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే అవకాశం వుందనే వార్త కూడా షికారు చేస్తోంది. తాజాగా బాలయ్య ను కలిసిన అనిల్ ఒక లైన్ వినిపించాడట. ఆ లైన్ నచ్చడంతో .. పూర్తి స్క్రిప్ట్ రెడీచేసి చెప్పమని బాలకృష్ణ అన్నాడట. దాంతో పూర్తి స్క్రిప్ట్ ను రెడీచేసే పనిలో అనిల్ రావిపూడి ఉన్నాడని తెలుస్తోంది. పైగా దానికి రామారావు అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పూర్తి స్క్రిప్టు రెడీ అయి అది బాలయ్యకు నచ్చితే, నిర్మాతగా దిల్ రాజు రెడీగా ఉన్నాడనీ .. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి పెద్దగా సమయం పట్టదని తెలుస్తోంది.