షాహిద్ మొదటి శుభలేఖ కరీనాకే...

June 25, 2015 | 07:06 PM | 2 Views
ప్రింట్ కామెంట్
shahid_invite_karina_niharonline

ప్రేమలు,  బ్రేకప్ లు ఇప్పుడు సర్వ సాధారణమై పోయాయి. సెలబ్రిటీలయితే మరీనూ... అసలేం జరగనట్టే ప్రవర్తిస్తున్నారు. అయితే బ్రేకప్ అయిన జంట మళ్ళీ కలవడానికి అంతగా ఇష్టపడరు. అది ఒకప్పటి మాట.... కానీ ఆ ఫీలింగ్స్ కూడా ఇప్పుడు ఎవరికీ ఉండడం లేదు. బాలీవుడ్ మాజీ లవర్స్ షాహిద్ కపూర్; కరీనా కపూర్లు కూడా ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టేసినట్టే. బ్రేకప్ అయ్యాక కూడా ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. ఇప్పడింకో సినిమా కూడా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన బెడితే, షాహిద్ తో బ్రేకప్ అయ్యాక కరీనా సైఫ్ ప్రేమలో పడి, అతడ్నే పెళ్ళాడిన సంగతి తెలిసిందే. వీరి పెళ్ళయి కూడా దాదాపు మూడేళ్లు అవుతోంది. షాహిద్ కూడా కరీనాతో బ్రేకప్ తర్వాత కొన్ని ప్రేమాయణాలు నడిపాడు. ఇప్పుడు సినీ రంగంతో సంబంధం లేని ఓ అమ్మాయిని పెళ్ళాడబోతున్నాడు. ఇంతకీ ఈ పెళ్ళికి కరీనాను పిలుస్తాడా లేదా అంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తన పెళ్ళికి షాహిద్ ను పిలవని కరీనా, అతను పిలిస్తే మాత్రం తప్పకుండా పెళ్ళికి వెళ్తానంటూ ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఆమెను షాహిద్ పెళ్ళికి పిలిచాడు. అది కూడా తన మొదటి పెళ్ళి శుభలేఖను పట్టుకెళ్ళి కరీనాకే ఇచ్చాడట షాహిద్. సైఫ్ ఇంటికెళ్ళి కుటుంబ సమేతంగా పెళ్ళికి రావాలని ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాడట షాహిద్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ