ఈ మధ్య విడుదల చేసిన అరవయ్యో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ లో బాలీవుడ్ బాద్షా షారూఖ్ పేరు లేకపోవడం గమనార్హం. ఆయనను ఫిల్మ్ ఫేర్ లిస్టులో ఎంపిక చేయకపోవడంపై అభిమానులు చాలా నిరసనగా ఉన్నారు. రీసెంట్ ఫిల్మ్ ‘హ్యాపీ న్యూ ఇయర్’కు షారూఖ్ పేరు నామినేట్ అవుతుందని, అవార్డ్ కూడా గ్యారంటీ అని అభిమానులు ఆశ పెట్టుకున్నారు. తీరా లిస్ట్ వచ్చేసరికి షారూఖ్ పేరు కనిపించకపోవడంతో అభిమానులు హర్టయ్యారు. ఈ విషయాన్ని షారుక్ ముందు పెట్టగా ‘గత సంవత్సరం నేను చేసింది ఒక్క సినిమానే, అది కూడా అంత గొప్పది కాదని నా అభిప్రాయం’అని చెప్పాడాయన. ‘హ్యపీ న్యూఇయర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది కానీ, మూవీలో తన పెర్ఫార్మెన్స్ విషయంలో ఆడియెన్స్ ను శాటిస్ఫై చేయలేక పోయాను... అందుకే అవార్డ్ నామినేషన్‌కు అనర్హుడిని’ అని నిర్మొహమాటంగా ఒప్పుకున్నాడట షారుఖ్.