మధురైగా మారిన కోకాపేట

January 31, 2015 | 01:19 PM | 27 Views
ప్రింట్ కామెంట్

కోకాపేటలో మూడు కోట్లతో భారీ సెట్టింగ్ తయారైంది. ఇది ఆ ప్రాంత వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. కోకా పేట జనాలంతా ఇప్పుడు ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఇది బన్ని-త్రివిక్రమ్ కాంబనేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రం షూటింగ్ కోసం వేసిన సెట్. ఆ చిత్ర షూటింగ్ కోసం ఈ సెట్ వేసి ఫ్యామిలీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయట. మరో ఐదు రోజులు ఇక్కడే షూటింగ్ జరుపనున్నారని తెలుస్తోంది. ఇక్కడ వేసిన సెట్ కు దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారు కళా దర్శకుడు రవీంద్ర. నిజానికి ఈ షూటింగ్ అంతా మధురైలో చేయాల్సి ఉందట. షూటింగ్ సమయంలో తమిళనాడులో అల్లర్ల వల్ల అక్కడికి వెళ్ళకుండా అదే మధురై ఇంటిని ఇక్కడ సెట్ చేసేశారు. ఇక్కడ షూటింగ్ అవగానే, కొన్ని సాంగ్స్ పార్ట్ పూర్తి చేయాల్సి ఉందంటున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని మార్చిలో చిత్రం విడుదల చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర పెద్ద భూస్వామిగా నటిస్తున్నాడు. అతనికి సంబంధించిన ఇల్లే ఈ భారీ సెట్టింగ్. అంటే అతను మధురైకి చెందిన భూస్వామి అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదా శర్మ, కోటశ్రీనివాసరావులు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ