సౌత్ ఇండియన్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు. ఈయనకు టేస్ట్ కు తగిన నటుడు అనిపించుకున్నాడు విక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న ‘ఐ’ సినిమా ఎన్ని సంచనాలు స్రుష్టించనున్నదో నని అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. తాజాగా మరో అరుదైన రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. ‘ఐ’ సినిమా హిందీ వెర్షన్ పాకిస్థాన్ లోని లాహోర్ లో బుధవారం విడుదల చేయనున్నారు.మామూలుగా మన బాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు పాకిస్థాన్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ మొట్ట మొదటి సారిగా ఒక సౌత్ ఇండియన్ డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మన సౌత్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ కు ఉన్న క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయినట్టు తెలుస్తోంది. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంతా 20 వేలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను చైనాలో 1500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.