మళయాళంలో పెద్ద హిట్టయిన ‘బెంగళూర్ డేస్’ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం నటీ నటుల ఎంపిక పూర్తిగా జరగలేదు. తాజాగా ఈ సినిమా కోసం సునీల్ ను ఒక ప్రముఖ పాత్రకు ఎంపిక చేశారట. తమిళ వర్షన్ పాత్రకు ‘జిగర్తాండ’ ఫేం బాబీ సింహాను సంప్రదించారట. వీరిద్దరూ కూడా ఇంకా తమ సమ్మతిని తెలపాల్సి ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ, సమంత, నిత్యామీనన్ ను ఈ సినిమా కోసం ఇంతకుముందే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సునీల్ కు భీమవరం బుల్లోడు తరువాత అవకాశం ఇదే అవుతుంది. ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళ, తెలుగు వర్షన్లు రెండూ పివిపి సినిమా బ్యానర్ లోనే నిర్మితమవుతున్నాయి.