సినిమా స్టార్లకు సినిమా ఆఫర్లు పక్కన పడితే వాళ్ళ బ్రాండ్ నేమ్ వాడుకోడానికి బిజినెస్ పీపుల్ చాలా ఉత్సాహ పడుతుంటారు. సినిమాలతో పాటు హీరోలు కూడా తమ అభిరుచుల మేరకు బిజినెస్ లు కూడా చేస్తున్నారిప్పుడు. కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేస్తూ, తమ ఓన్ సంస్థలతో మరికొన్ని బిజినెస్ లు చేసుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ సినిమాల్లో నటించడం, నిర్మించడమే కాకుండా చాలా బ్రాండ్లకి అంబాసడర్‌గా పని చేస్తూ రెండు చేతులా సంపాదించేస్తున్నాడు. ఓన్ బ్యానర్‌తోపాటు ఐపిఎల్ లాంటి స్పోర్ట్స్ టోర్నీలకు కో స్పాన్సర్ గానూ బిజినెస్ చేసుకుంటున్నాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ కు పార్ట్ నర్‌గా ఉన్న షారుఖ్ సంస్థ, రెడ్ చిల్లీస్‌కు స్పాన్సర్ షిప్ చేస్తూ రోజ్ వ్యాలీ గ్రూప్ రూ.10 కోట్లు చెల్లించిందని సమాచారం. అయితే కొత్తగా ఈ గ్రూప్ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ కంపెనీ చైర్మన్ గౌతం అరెస్ట్ అయ్యాడు. దీంతో ఈ సంస్థ ప్రతిష్ఠ దెబ్బతిన్నది. ఇలాంటి కారణాల వల్ల ఆ సంస్థతో తనకు స్పానర్‌షిప్ అవసరంలేదని భావించిన షారుఖ్ ఆ సంస్థ నుంచి తాను స్పాన్సర్షిప్ కోసం తీసుకున్న పది కోట్లు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే షారూఖ్ పోతేపోనీ పది కోట్లు అనుకున్నట్టున్నాడు పాపం.