చివరి దశకు చేరుకున్న సల్మాన్ కేసు

March 27, 2015 | 01:23 PM | 102 Views
ప్రింట్ కామెంట్
SalmanKhan_PTI_court_case_niharonlineస

బాలీవుడ్ సినిమాల్లో పెద్ద హీరోగా వెలిగిపోతున్న సల్మాన్ ఖాన్ ను రెండు కోర్టు కేసులు ఇంకా వదిలి పెట్టలేదు. ఒకటి జింకను వేటాడిన కేసు కాగా మరొకటి కారు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైనందుకు.  కోర్టులో శుక్రవారం తన కేసు వాయిదా ఉంది. ఈ రోజు జరగనున్న కోర్టు కేసు సల్మాన్ కు కీలకమైనది. ఈ కేసులో మొత్తం 25 మంది సాక్షులను విచారించిన తరువాత సీఆర్‌పీసీలోని 313 సెక్షన్‌ ప్రకారం చివరి సారిగా ఖాన్‌ తన వాదనను కోర్టు వారికి వినిపించాల్సి ఉంటుంది. శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని న్యాయమూర్తి డి.డబ్లూ.దేశ్‌ పాండే సమన్లు జారీ చేశారు. తీర్పుకు ముందు సల్మాన్ కు కూడా సాక్షులను ప్రశ్నించే అవకాశం కల్పిస్తారు. చివరగా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సల్మాన్‌ఖాన్ వాంగ్మూలంతో కేసు విచారణ పూర్తవుతుంది. ఇక కేసు చివరి దశకు చేరుకోవడంతో సల్మాన్‌ఖాన్‌కు ఏ శిక్ష వేస్తారోనన్న చర్చలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ