అవును. పవన్ కళ్యాణ్ లేకుండా సర్దార్ సినిమా షూటింగ్ జరుపుకుంటుందట. ఫిలింనగర్ నుంచి అందుతున్న ప్రకారం దాదాపు 2 కోట్ల ఖర్చుతో వేసిన భారీ సెట్లో పవన్ లేకుండానే ఈ భారీ షెడ్యూల్ కొనసాగుతోంది అని సమాచారం. సాధారణంగా ఒక హీరో లేకుండా ఏ సినిమాకు సంబంధించిన ఇంత భారీ షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది అంటే దాని పై రకరకాల అనుమానాలు తలెత్తుతాయి. అందునా సర్దార్ విషయంలో మొదటి నుంచే గాసిప్సే. దీంతో అసలు విషయం ఏంటో తెలీకుండా ఇలా సస్పెన్స్ మెయింటెన్ చేయటంతో అభిమానుల్లో కలవరపాటు నెలకొంటుంది.
సుమారు 20 రోజుల పాటు కొనసాగే ఈ భారీ షెడ్యూల్ లో పవన్ ఎప్పుడు వచ్చి చేరుతాడు అన్న విషయం పై క్లారిటీ లేదు అని అంటున్నారు. ఈ భారీ షెడ్యూల్ లో ఒక్క పవన్ తప్ప మిగిలిన కీలక తారాగణం అంతా పాల్గొంటూ ఉండటంతో పవన్ కు ఏమైంది ? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ గతంలో ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రాంతంలోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం భారీ సెట్ ను వేసారు అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సర్దార్ యూనిట్ తరపున ఈ విషయమై ఎలాంటి సమాచారం లేదు.