‘రన్ రాజా రన్’, ’మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలు పెద్ద హిట్ సాధించడంతో శర్వానంద్ కు ఇప్పుడు ఆఫర్లు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన ఓ పెద్ద బ్యానర్ (యు.వి.క్రియేషన్స్) కి సైన్ చేశాడట. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో సక్సెస్ సాధించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రన్ రాజా రన్’ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ తిరిగి అదే హీరోతో మరో సినిమా చేయాలని తలపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిసింది. గోపీచంద్ ‘జిల్’ సినిమా నిర్మిస్తున్న ఈ సంస్థ, ఈ చిత్రం పూర్తవగానే శర్వానంద్ సినిమా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు.