ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అయిపోయాడు. మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టినా, హీరోగా ఓకే అనిపించుకోవడంతో ఇతగాడికి సినిమా ఛాన్సులకేం కొదువ లేదు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ హీరోగారికి హీరోయిన్ల బెడద బాగానే ఉంది ఎందుకంటే ఇతని హైట్ కు తగ్గ అమ్మాయి కావాలంటే పొట్టి వాళ్ళు కష్టమేనట. ఈ సినిమాకు ఎట్టకేలకు ఓ హీరోయిన్ ను పట్టేశారు. అమ్మడి పేరు ప్రగ్య జైశ్వాల్. మాజీ మిస్ ఇండియా, బాలీ వుడ్ లో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించిందట. తమిళంలో విరాట్టు అనే ఓ సినిమా చేసింది. ఇక తెలుగులోనూ ఓ సినిమా మిర్చిలాంటి కుర్రాడు తో ఎంట్రీ ఇచ్చింది. చేసిన సినిమాలేవీ గుర్తింపు రాకపోయినా ఈ అమ్మడు ఒడ్డూ పొడవూ ఉన్న అమ్మాయి కాబట్టి వరుణ్ తేజ్ కు బాగా సెట్టయ్యింది. అయితే ఈ సినిమా స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఓ కథ లా ఉంటుందంటున్నారు. అంటే అనీల్ కపూర్ మనీషా కొయిరాలా 1942 లవ్ స్టోరీలా ఉండవచ్చా? అలాంటి క్యారెక్టర్ లో అయితే వరుణ్ తేజ్ బాగా సెట్ అయిపోతాడనిపిస్తుంది. చూద్దాం వరుణ్- ప్రగ్య ల లవ్ మేటర్ ఏమిటో?