స్టార్ డైరక్టర్ చేతికి కత్తెర బాధ్యతలు

January 02, 2016 | 12:50 PM | 2 Views
ప్రింట్ కామెంట్
shyam-benega-new-censor-board-head-niharonline

గతేడాది ఏడాది ప్రారంభం నుంచి సెన్సార్ బోర్డుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నిహలానీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బోర్డు సభ్యులు పలు ఆరోపణలు చేశారు. సభ్యులను సంప్రదించకుండా నిహలాని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, సినిమాల్లో నిషేధిత పదాల జాబితాను తమకు తెలియకుండానే ప్రకటించడం, సినిమాల్లో పలు దృశ్యాలను కట్ చేయడం వంటి విషయమై ఏకపక్ష నిర్ణయాలను నిహలాని తీసుకోవడం, ఈ నేపథ్యంలో బోర్డు సభ్యులు కేంద్ర సర్కార్ ని తప్పుబట్టడం వంటి విషయాలు తెలిసినవే. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సంస్కరణ బాధ్యతలను ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగళ్ కు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో ఈ ప్యానెల్ పనిచేస్తుంది. సెన్సార్ బోర్డు, సినిమాటోగ్రఫీ యాక్టులో చేపట్టాల్సిన సంస్కరణల విషయమై శ్యామ్ బెనగళ్ సలహాలు, సూచనలను ఈ మంత్రిత్వ శాఖ స్వీకరిస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ