టాలీవుడ్ లో కథానాయికలు తమ కెరియర్ జోరు మీద ఉన్నంతవరకూ సినిమాలు చేసి, ఆ తరువాత పెళ్లి చేసుకుని ఏదో ఒక లాభసాటి రంగంలో స్థిరపడే ఆలోచన చేస్తుంటారు. కానీ ముద్దుగుమ్మ సమంత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచన చేస్తున్నట్టు ఆమె మాటల వలన తెలుస్తోంది. ఏ ముహూర్తాన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిందో తెలియదుగానీ, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
తెలుగు .. తమిళ భాషల్లో ఆమె ప్రయాణం అగ్రకథానాయికగా కొనసాగుతూనే వుంది. అయితే ఎప్పుడైనా తాను చిత్రపరిశ్రమ నుంచి తప్పుకోవలసిన పరిస్థితి వస్తే మాత్రం, తన పూర్తి సమయాన్ని సమాజ సేవకి కేటాయిస్తానని సమంతా చెబుతోంది. తనకంటే ప్రతిభావంతులు .. అందగత్తెలు చాలామంది వుండగా, కథానాయికగా తనకి మంచి స్థానం లభించిందని సమంతా అంటోంది. తాను ఆశించిన దానికంటే ఎక్కువగా ఆ భగవంతుడు తనకి పేరు ప్రతిష్ఠలు .. డబ్బు ఇచ్చాడని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. పెళ్లి మాట పక్కనబెట్టి, సినిమాలకి దూరమైన రోజున తన పూర్తి సమయాన్ని సమాజ సేవకి ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది. రూపమే కాదు మనసు కూడా అందమైందని ఆమె మాటలతో అర్థమైపోతుంది.