కోలీవుడ్ జనాలు లిటిల్ సూపర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే శింబు ప్రస్తుతం అక్కడి మహిళల ఆగ్రహం చవిచూస్తున్నాడు. అసభ్య పదాలతో యువతులను కించపరిచేలా వ్యవహారించాడంటూ పెను దుమారమే రెగింది. ఇంతకీ విషయమేంటంటే... తమిళనాడులో ప్రస్తుతం 'బీప్ సాంగ్' అనే పాట బాగా పాపులర్ అయ్యింది. చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలిదాకా అందరూ దాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట పాడింది ఎవరో కాదు శిలంబరసన్ అలియాస్ శింబు, ఇక దీనికి సంగీతం అందించింది కోలవెరి ఫేం అనిరుధ్. పాట పాపులర్ అయినప్పటికీ అందులో వల్గర్ పదాలు ఎక్కువగా వాడారని, ఆడాళ్లను అవమానించేలా ఈ పాట ఉందని ఆరోపిస్తూ మహిళా సంఘాల కోయంబత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కోవై కమిషనర్ కూడా ఈ కేసును సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు. దీంతో శింబు, అనిరుధ్ ల అరెస్ట్ కోసం రంగం సిద్ధమౌతుంది. ఇంకోవైపు ఈ బూతు పాటకు అర్థం తెలీక చిన్నారులు సైతం వివిధ స్టేజ్ షోల్లో పాట పాడుతుండటంతో పలువురు తల్లిదండ్రులు సామాజిక మాధ్యమాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో పాట పాడింది శింబు కాదని, తమ హీరో ఇటువంటి పాటను పాడివుండడని ఆయన అభిమానులు అంటున్నారు. ఈ పాటలకు వాయిస్ టెస్ట్ చేసి వాస్తవాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో శింబు అధికారికంగా స్పందించనప్పటికీ, సంగీతాన్ని మాత్రం తాను సమకూర్చలేదని అనిరుధ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయటం విశేషం. సెలబ్రిటీల అరెస్ట్ కి సంబంధించిన విషయం కావటంతో పక్కా సాక్ష్యాధారాలతో ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.