గుణ తీసిన ఆ సినిమా చూసి సిగ్గు పడ్డా

December 14, 2015 | 12:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
dasari-praised-gunasekhar-at-KV-reddy-award-niharonline

దర్శకరత్న దాసరి మరోసారి ఈ తరం దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తరం దర్శకుల్లో క్వాలిటీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే గతంలో ప్రముఖ దర్శకుడి కేవీ రెడ్డి పేరుతో నెలకొల్పిన అవార్డును తొలగించమని చెప్పాను అని దాసరి వ్యాఖ్యానించారు. ఈ ఏడాదికి గానూ కేవీ రెడ్డి అవార్డును స్టార్ డైరక్టర్ గుణశేఖర్ అందుకున్నాడు.   యువ కళావాహిని అందజేస్తున్న ఈ అవార్డు కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. దీనికి దాసరి ముఖ్యఅతిథిగా హజరయి గుణను శాలువాతో సత్కరించి, అవార్డును అందజేసారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కిరీటాన్ని అందించారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ... అవార్డును తొలగించమని నేనే చెప్పా. కానీ, ఇప్పుడు అవార్డు అందుకున్న గుణశేఖర్ దీనికి అన్ని విధాల అర్హుడు. కేవీ రెడ్డి నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో క్లాసిక్ చిత్రాలను మనకు అందించారు. ఆయన టచ్ చేయని జోనర్ లేదు. అలాంటి అవార్డు అందుకున్న గుణ నిజంగా గొప్పవాడు. గుణశేఖర్ తెరకెక్కించిన సొగసు చూడతరమా చూసి సిగ్గుపడ్డాను, దర్శకుడిగా అతని ఆలోచనలు అద్భుతం అని దాసరి అన్నారు. అతను తీసిన రుద్రమదేవీ ఒక్కటి చాలు అతడు ఎంత ప్రతిభావంతుడో చెప్పటానికి అంటూ పొగడ్తల వర్షంతో ముంచేశాడు. దీనిపై కె.వి.రెడ్డి గారి పేరుతో వున్న అవార్డు నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దాసరి గారి పేరుపైన కూడా ఒక అవార్డు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనలాగే దాసరిగారు కూడా టచ్ చేయని జోనర్ సినిమాలు లేవు. ఆయన తీసిన సినిమాలనే ఇప్పటి దర్శకులు ఫాలో అవుతున్నారు అంటూ వ్యాఖ్యానించటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ