ఈ హీరోయిన్ వెయ్యిమందికి టోకరా...

June 03, 2015 | 05:12 PM | 1 Views
ప్రింట్ కామెంట్
actress_Leena_cheating_1000_members_niharonline

చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ దాదాపు వెయ్యిమందికి కుచ్చుటోపీ తగిలించింది హీరోయిన్ లీలా మారియా పౌల్. ఇండస్ట్రీలో ఆమెకు అందుబాటులో ఉన్న చాలా మందిని కోట్లాది రూపాయలకు మోసగించింది. ఇప్పుడు ఈ అమ్మడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈమె బుట్టలో ఐటెం బాంబ్ రాఖీ సావంత్ కూడా పడిందట. లీనా మారియా పాల్ (26), ఆమె సహజీవన భాగస్వామి శేఖర్ చంద్రశేఖర్ (25) మరికొందరితో కలిసి దాదాపు వెయ్యిమందికి టోపీ పెట్టి 9 లగ్జరీ కార్లు, 117 ఇంపోర్టెడ్ వాచీలు, ఒక స్పోర్ట్స్ బైకు, 12 సెల్ ఫోన్లు, ఇంకా అనేక విలాసవంతమైన వస్తువులు సొంతం చేసుకున్నారు. దాంతో ముంబై క్రైం బ్రాంచి ఆర్థిక నేరాల విభాగం పోలీసులు వాళ్లను, వాళ్లతో పాటు అదిల్ జైపురి (24) అఖ్తర్ జైపురి (55), సల్మాన్ రిజ్వీ (28), నజీర్ జైపురి (50) అనే నలుగురిని కూడా అరెస్టు చేశారు. రెడ్ చిల్లీస్ అనే సినిమాలో మోహన్ లాల్ తోను, మద్రాస్ కేఫ్ సినిమాలో జాన్ అబ్రహంతోను పాల్ హీరోయిన్ గా పనిచేసింది. లయన్ ఓక్ ఇండియా అనే బోగస్ కంపెనీ పెట్టి, వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలు పెట్టుబడులుగా తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడి మీద నెలకు 20 శాతం చొప్పున మూడు నెలల్లో 300 శాతం లాభాలు ఇస్తామని వీళ్లు చెప్పేవారు. వాళ్లు కట్టిన డబ్బుతో వ్యాపారాలు ఏమీ చేయక పోగా లగ్జరీ కార్లు కొనేవాళ్లు. బెంట్లీ, ఆడి, మెర్సిడిస్, మాసెరాటి, నిస్సాన్ లాంటి బ్రాండ్ కార్లు వాళ్ల వద్ద ఉన్నాయి. రూ. 23 లక్షల విలువైన హోండా స్పోర్ట్స్ బైకు కూడా ఉంది. అంతేకాదు, చంద్రశేఖర్ తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకొని, ఓ బ్యాంకు నుంచి రూ. 19 కోట్ల రుణం కూడా తీసుకున్నాడట. ఇక ఐటం బాంబ్ రాఖీ సావంత్ దగ్గర 2.5 పెట్టుబడి పెట్టిందట. వాళ్ల జీవనశైలి చూసి ఆశ్చర్య పోయానంటూ పోగొట్టుకున్న డబ్బు గురించి విచారిస్తోంది రాఖీ సావంత్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ