తమకు ఇచ్చిన రెమ్యునరేషన్ ప్రకారం సినిమాల్లో నటించేసి, ఆనక చెక్కేసే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. మళ్ళీ సినిమాకు ప్రమోట్ చేయడమంటే... మరికొంత ఇచ్చుకుంటే బాగుండన్నట్టు ప్రవర్తిస్తారు చాలా మంది హీరోయిన్లు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సినిమా ప్రమోట్ చేయడం కోసం చాలా సిన్సియర్ గా ఉంటారు. అలాంటి వారిలో శ్రద్దా దాస్ ఒకరని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు తన సినిమాలను ప్రమోట్ చేయడంలో చాలా కమిటెడ్‌గా ఉంటుందట. ‘రేయ్’సినిమాను ప్రమోట్ చేయడంలో కూడా ఈమె చిత్ర యూనిట్ కు చాలా సహకరించిందట. ఆ సినిమా లాగేనే చాలా రోజులు షూటింగ్ జరుపుకున్న మరో సినిమా ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ కోసం ఇప్పుడు అమ్మడు బ్యాంకాక్ నుండి వచ్చిందట. సినిమాలు హిట్టయినా అవ్వకపోయినా, తన వంతు బాధ్యతగా తాను నటించిన సినిమాల ప్రమోషన్‌కు మాత్రం వచ్చేస్తుంది శ్రద్దా దాస్. ఈ అమ్మడి కమిట్ మెంట్ చూసిన ఇండస్ట్రీ పెద్దలు ఆమెను చాలా మెచ్చుకుంటున్నారట. ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా ఇవ్వని శ్రద్ధ కమిట్ మెంట్ ను మెచ్చుకుని అయినా ఓ పెద్ద డైరెక్టరో నిర్మాతో తనకు సినిమా ఛాన్స్ ఇవ్వాలని కోరుకుందాం.