అతిలోక సుందరి చిలక పలుకులకు కోటి కావాలట. తన అందచందాలతో ఇండియా మొత్తాన్ని మెస్మరైజ్ చేసిన శ్రీదేవి కొన్నేళ్ళ తరువాత సౌత్ లో నటించిన మొదటి సినిమా పులి. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాణిగా నటించారు. హన్సిక, శ్రుతిహాసన్, సుదీప్ తదితరులు నటించారు. ఈ చిత్రం తెలుగులోనూ ఈ పేరుతోనే విడుదల చేస్తున్నారు. అయితే శ్రీదేవి సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి కాబట్టి ఆమెకు డబ్బింగ్ వేరే వాళ్ళు చెపితే బాగుండదుగా అందుకే తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు ఆమెను పిలిపిస్తున్నారని సమాచారం. అయితే తెలుగు డబ్బింగ్ చెప్పేందుకు ఆమె కోటి రూపాయలు వసూలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. తమిళంలో మాత్రం ఆమే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే చివర్లో నటించిన కొన్ని సినిమాల్లో ఆమె డబ్బింగ్ చెప్పుకోలేదట. ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం డబ్బింగ్ చెప్పుకోవడం కోసం చెన్నైలోనే కొన్ని రోజుల పాటు బస చేసిందట. ఆమె తెలుగులో కూడా డబ్బింగ్ తానే చెప్పుకుంటానని చెప్పడంపై తెలుగు నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. తెలుగు వెర్షన్ రైట్స్ ని శోభారాణి 12 కోట్లుకు తీసుకున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదలకు సిద్ధమైంది.