ఒక్క బాహుబలిని తప్ప అన్ని సినిమాల రికార్డులనూ బద్దలు కొట్టి ముందుకు దూసుకుపోతోంది శ్రీమంతుడు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇప్పటికీ కలెక్షన్లు తగ్గకుండా అన్ని థియేటర్లలో ఆడుతోంది. ఒక రకం సినిమాలు తీసి ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చనే భ్రమలో కొందరు జనాల్ని రెచ్చగొట్టే సీన్లతో సినిమాలు తీసేసి చేతులు కాల్చుకుంటున్నారు. అలాంటిది ఒక మెసేజ్ తో కూడిన క్లీన్ సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించడం ఇది సినిమాకే మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. దీనికి దర్శకుడు కొరటాల శివను అభినందించాలి. ఇప్పుడు ఈ సినిమా తొలి 9 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో ఐదో వారం కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తెలుగు సినిమా పరిశ్రమలో హైయ్యెస్ట్ కలెక్షన్లలో ‘శ్రీమంతుడు' రెండో స్థానంలో ఉంది. 26 రోజుల్లో ఈ చిత్రం రూ. 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. అంతకు ముందు సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ (150 కోట్ల గ్రాస్), ఈగ (125 కోట్ల గ్రాస్), మగధీర (150 కోట్ల గ్రాస్) లైఫ్ టైమ్ రికార్డులను ఈచిత్రం బద్దలు కొట్టింది. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్ రుషి, సంపత్, హరీష్, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన నటించారు. పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సి.వి.ఎమ్), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.