నటి నమిత తాజాగా ఓ ఫోటో షూట్ రిలీజ్ చేసింది. ఇప్పుడిదీ చూసిన వారు ఔరా ఇది నమితేనా అని ముక్కున వేళ్లు వేసుకుంటున్నారు. బొద్దుగా ఉండే ఈ గుమ్మ స్లిమ్ గా మారి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో ఫేట్ లేకపోవటంతో కోలీవుడ్ చెక్కేసిన ఈ గుజరాతీ భామ గున్నలా తయారయ్యింది. అయితేనేం అక్కడి జనాలకు ఆమె పిచ్చిపిచ్చిగా నచ్చేసి బ్రహ్మరథం కట్టారు. దీంతో కుష్భూ మాదిరిగానే ఆమెకు ఓ గుడి కట్టి ఆరాధించేశారు. పెద్దగా హిట్ సినిమాలు లేకపోయినా ఆమెకు తమిళంలో ఉన్న క్రేజ్ మాములిది కాదు. దీంతో ఇప్పుడా క్రేజ్ ను వాడుకోవాలని నమిత చూస్తోంది. అదే రాజకీయ రంగ ప్రవేశం. వచ్చే యేడు జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని అనుకుంటుందట. ఇప్పటికే ఆమెను పలు పార్టీలు సంప్రదించాయట కూడా. దీనిపై ఆమె స్పందిస్తూ... లావు తగ్గడం నీవల్ల కాదు అన్నారు. తగ్గి చూపించా... ఇప్పుడు రాజకీయాలు నావల్ల కాదు అంటున్నారు. దాని సాధ్యం చేసి చూపిస్తా అంటూ పేర్కొంది. నా పని అయిపోయిందని అనుకున్న సమయంలో తమిళ ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నారు. అలాంటి వారికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వద్దామనుకుంటున్నాను. ఈ రకంగానైనా వారి రుణం తీర్చుకుంటానని చెప్పుకొచ్చింది. భారీగా ఉన్నప్పుడు ఆదరించారు కానీ ఇప్పుడు స్లిమ్ అయ్యావ్ గా మరి వాళ్లకి ఇప్పుడు నప్పుతావో లేదో కనుక్కొని వాళ్ల దగ్గరికి వెళ్లమ్మా? లేకపోతే ఓట్లు పడవు. అయినా రాజకీయాలంటే తిండి మాని సన్నబడటం కాదు.