మాట్లాడలేకపోయానని ఫీలవుతున్న శ్రీమంతుడి సిస్టర్

August 03, 2015 | 05:24 PM | 4 Views
ప్రింట్ కామెంట్
srimanthudu_sister_nikitha_anil_niharonline

ఇంతవరకూ వచ్చిన ఫామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఢోకా లేదన్నది తెలిసిన విషయమే. శ్రీమంతుడులో అలాంటి ఎలామెంట్స్ కనిపిస్తున్నాయి... దీంతో పాటు ఓ మెసేజ్ అన్ని సినిమాల్లో ఉన్నట్టే యాక్షన్ సెంటిమెంట్స్.... ఈ సినిమాపై అందరికీ అంచనాలు భారీగానే ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్‌లో మైత్రి మూవీస్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌లో మహేష్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారని టాక్.  అయితే ఈ సినిమాలో హీరోయిన్, మదర్, ఫాదర్, క్యారెక్టర్లు నటీ నటులు తెలుసు కానీ, ఇందులో మహేష్ అక్క చెల్లెళ్లుగా ముగ్గురు ఉన్నారన్న విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చదవ లేదు. అయితే ఈ పాత్రల్లో అప్‌కమింగ్ హీరోయిన్స్ నటిస్తున్నారని సమాచారం.  చెల్లెలుగా ‘బాయ్ మీట్స్ గర్ల్’ ఫేం నికిత అనిల్ నటించిందట. కొన్ని సీన్స్‌లో నటించినా హలో..  హాయ్..  వరకే సీన్లు ఉన్నాయనీ, మహేష్‌ను పరిచయం చేసుకోలేకపోయానని ఈ అమ్మడు తెగ ఫీల్ అవుతోందట.  రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న నికిత, శ్రీమంతుడు ప్రమోషన్ ప్రోగ్రామ్ లో మహేష్‌ ను పలకరించి, పరిచయం చేసుకోవాలని తెగ ఆరాట పడిపోతోంది. అమరి అవ కాశం అమ్మడికి రావాలని కోరుకుందాం...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ