ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదలై ‘బాహుబలి’ కలెక్షన్లు ఊహించని రీతిలో వసూళ్ళు చేసి మన తెలుగు సినిమా స్థాయి ప్రపంచానికి చాటింది. అయితే ఆ సినిమా 50 రోజులకు దగ్గర పడేసరికి 129 సెంటర్లలో మాత్రమే నిలబడింది. ‘బాహుబలి’ బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడ ఖర్చుపెట్టని ‘శ్రీమంతుడు’ 50వ రోజుకు 185 ధియేటర్లలో ఇంకా నడుస్తుండడం ఒక రికార్డుగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో బాహుబలి శ్రీమంతుడిని అధిగమించలేకపోయింది. అయితే ప్రభాస్ అభిమానులు ‘బాహుబలి’ సినిమాను రికార్డుల కోసం అత్యధిక ధియేటర్లలో ప్రదర్శింప చేయడానికి ప్రయత్నించారు. కానీ రాజమౌళి అందుకు ఒప్పుకోలేదు. అందుకే శ్రీమంతుడికి ఈ విధంగా క్రెడిట్ దక్కిందంటున్నారు కొందరు సినీ అభిమానులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 180కోట్ల వసూళ్ళ ని సాధించింది.
మరో విశేషం ఏమిటంటే తెలుగులో సూపర్ హిట్ తెలుగులో సక్సెస్ సినిమాలు బాలీవుడ్ లో ఇప్పటి వరకూ సల్మాన్ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా తనే చేస్తాడనే టాక్ వచ్చింది. కానీ బాలీవుడ్ లో శ్రీమంతుడు గా హృతిక్ రోషన్ కన్పిస్తాడట ! వచ్చే నెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారట.