చివరికి చెర్రీ సినిమా టైటిల్ ఖరారు

August 29, 2015 | 12:03 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Ram_Charan_bruce_lee_niharonline

రాంచరణ్-శ్రీనువైట్ల కాంబినేషన్ రాబోతున్న సినిమా టైటిల్ కోసం ఎన్నెన్ని పేర్లు వినిపించారు.  చివరికి టైటిల్ వరలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఖరారు చేశారు. చిరంజీవి బర్త్ డే రోజు ఈ టైటిల్ వినిపిస్తారనుకుంటే ఆ రోజున కూడా టైటిల్ లేకుండా రాంచరణ్ ఫస్ట్ లుక్ వదిలారు. ఇప్పుడు ఈ సినిమాకు ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ఖరారు చేశారు.  ట్యాగ్ లైన్ ది ఫైటర్ అని పెట్టేశారు. ఇది ఎప్పటినుంచో వినిపిస్తున్న టైటిలే అయినప్పటికీ ఇంకా మంచి టైటిల్ ఏదైనా తగులుతుందనుకున్నారేమో కానీ, విడుదలకు రెడీ అవుతుండడంతో ఇక లాభం లేదనుకుని ఆ టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ టీజర్ లోని చెర్రీ చెప్పే డైలాగ్ ‘నీ మీటర్ పగిలితేగానీ, నా మీటర్ అర్థంకాదు’ సూపర్బ్ గా వుందంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తొలిసారిగా నటిస్తోంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల కానున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ