హర్రర్ మూవీస్ కి పెట్టింది పేరు హాలీవుడ్. భయానక చిత్రాలను తెరకెక్కించడంలో వారిని మించిన వారు లేరనే చెప్పొచ్చు. 70 వ దశకం నుంచి ఇప్పటిదాకా వచ్చిన భీభత్సమైన హర్రర్ చిత్రాల్లో టాప్ పది చిత్రాలు మీకోసం...
ఇట్ : స్టీఫెన్ కింగ్ నవల ఆధారంగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్. టామీ లీ వాలెస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హ్యారీ అండర్ సన్, డెన్నిస్ క్రిస్టోఫర్ ప్రముఖ పాత్రలు పోషించారు. ఓ క్లోన్ (బఫూన్ గెటప్) వ్యక్తి మనుషులను తన శాడిజంతో ఆడుకునే కాన్సెప్ట్ ఈ చిత్రం. 1990 లో విడుదలైన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై విశేష ప్రజాదరణ పొందింది.
ది షైనింగ్ : 1980 లో వచ్చిన బ్రిటీష్ అమెరికన్ హర్రర్ మూవీ. దీనికి కూడా స్టీఫెన్ కింగ్ నవలే ఆధారం. అయితే చిత్రం కోసం ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేశారు. స్టాన్లీ క్యూబ్రిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్ నికోల్సన్, షెల్లీ దువాల్, డానీ లాయిడ్ తదితరులు నటించారు. ఓ పాడుపడిన హోటల్ కి సంరక్షకుడిగా వెళ్లిన ఓ వ్యక్తి ఫ్యామిలీ అక్కడ దెయ్యాల చేతుల్లో ఇరుక్కుపోవటం. వాటి ప్రభావంతో అతగాడు తన భార్యా, కొడుకుని చంపాలని ప్రయత్నించడం, వారు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారన్నది ఈ చిత్ర కథ. ఈ చిత్రాన్ని మోడ్రన్ హర్రర్ చిత్రాలకు మాస్టర్ పీస్ గా అభివర్ణిస్తారు.
ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్ : 2003 లో వచ్చిన సౌత్ కొరియన్ మూవీ హంగుల్ ఆధారంగా వచ్చిన చిత్రం. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో 2009 లో ది అన్ ఇన్వైటెడ్ గా రీమేక్ చేశారు. కిమ్ జి వున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొరియన్ జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. మానసిక చికిత్సాలయం నుంచి డిశ్చార్జి అయిన ఇద్దరు అక్క చెల్లెలు తమ సవతి తల్లితో కలిసి చేసే భీభత్సం ఈ చిత్రం. అమెరికాలో విడుదలైన ఈ కొరియన్ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. 2004 ఫెంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది.
ది ఐ 10: 2005 లో వచ్చిన ది ఐ ఇన్ఫినిటి. ఐ 3 గా కూడా ఇది రిలీజ్ అయ్యింది. పాంగ్ బ్రదర్స్ దీనికి దర్శకత్వం వహించారు. బోలిన్ చెన్, కేట్ యువాంగ్, బొంగ్ కోజ్ కొంగ్ మలై తదితరులు తారాగణం. ఓ మ్యాజిక్ పుస్తకంతో ఐదుగురు ఫ్రెండ్స్ ఆడే ఆటే ఈ చిత్ర కథ. ది టెన్ ఎన్ కౌంటర్స్ అనే మ్యాజికల్ పుస్తకాన్ని కొన్న ఓ స్నేహితుడు తన నలుగురి మిత్రులను ఇంటికి ఆహ్వానిస్తాడు. అనుకోకుండా వారు ఆడిన ఆట వారి ప్రాణాలను ముప్పు తెస్తు ఉంటుంది. థాయ్ భాషలో వచ్చిన ఈ చిత్రం ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి అనువాదమై అక్కడ విజయం సాధించింది.
ఏ నైట్ మేర్ ఆన్ ఇఎల్ఎం స్ట్రీట్: 1984 లో వచ్చిన అమెరికన్ హర్రర్ చిత్రం. వెస్ క్రావెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పేరిట తర్వాత చాలా సిరీస్ లు వచ్చాయి. హీథర్ లాంగెన్ క్యాంప్, జాన్ శాక్సన్, రోనీ బ్లాకీ, అమందా వ్యాస్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఓ యువ బృందం కలలో అనుకొని పరిస్థితుల్లో ఓ వ్యక్తి చేతుల్లో మరణిస్తూ ఉంటుంది. ఆ తర్వాత వారు నిజంగానే మరణిస్తారు. దానికి గల కారణాలు వారికి కూడా తెలీదు. కానీ, వారి తల్లిదండ్రులకు దాని వెనుక గల కారణాలు తెలిసి ఉంటాయి. అమెరికన్ హర్రర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయి ఆ తర్వాత చాలా హర్రర్ చిత్రాలకు ఇదే మూలం అయ్యింది.
షట్టర్: 2004 లో వచ్చిన థాయ్ హర్రర్ చిత్రం. ఆ తర్వాత ఈ చిత్రం 2008 లో ఇంగ్లీష్ లో కూడా అదే పేరుతో అనువాదమైంది. మాసయూకీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జోషువా జాక్సన్, రాచెల్ టైలర్, మెగమి ఓకినా తదితరులు నటించారు. ఓ ఫోటో గ్రాఫర్ ను ప్రేమించిన ఓ అమ్మాయి అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత దెయ్యమై అదే ఫోటోగ్రాఫర్ భుజాల మీదే ఉంటూ అతన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. తన ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను చంపుతూ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఆమె ఆత్మహత్యకు అతగాడు కూడా ఓ కారణమని తెలిసి చనిపోదామనుకున్న ఆ ఫోటోగ్రాఫర్ చివరికి ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరతాడు. మొదట్లో చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ రానురానూ మంచి కలెక్షన్లను రాబట్టగలిగింది. ఈ చిత్రం తెలుగులో గీతామాధురి భర్త నందు హీరోగా, అంజలి హీరోయిన్లుగా ఫోటో పేరుతోనూ, హిందీలో శ్రేయాస్ తల్పడే, సదా లు హీరోహీరోయిన్లుగా క్లిక్ పేరుతోనూ నిర్మితమైంది. రెండు చోట్ల అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
ది ఐ: 2008 లో అమెరికన్ చిత్రం. డేవిడ్ మెరియో, క్సేవియర్ పాల్ద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెబాస్టియన్ గుటిరెజ్ స్క్రిప్ట్ సమకూర్చాడు. జెస్సీకా ఆల్బా, పార్కర్ పోసే ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్నతనంలో ఓ ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన అమ్మాయికి పెద్దాయక వేరే వ్యక్తి కళ్లను అమరుస్తారు. అక్కడి నుంచి అసలు కథ మొదలౌవుతుంది. ఆమె కంటి అనుకొని దృశ్యాలు కనిపిస్తుంటాయి. సస్పెన్స్ హార్రర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అమెరికన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ది రింగ్ : 2002 లో వచ్చిన అమెరికన్ హర్రర్ మూవీ. మొదటగా ఇది జపనీస్ భాషలో అదే పేరుతో వచ్చింది. కోజీ సుజుకీ రచించిన రింగ్ నవల ఆధారంగా చిత్రం తెరకెక్కింది. ఆ తర్వాత దాన్ని ఇంగ్లీష్ లో రీమేక్ చేశారు. గోర్ విబిన్ స్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోమీ వాట్స్ లీడ్ పాత్ర పోషించారు. అమెరికా హర్రర్ చిత్రాలకు ఆజ్యం పోసిందే ఈ చిత్రం. భయానక దృశ్యాలతో వండర్ ఫుల్ గ్రాఫిక్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఓ వీడియో టేప్ ను చూసినందుకు వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ వీడియోలో కనిపించే ఆమె బయటకు వచ్చి వారందరినీ మట్టుపెట్టుతుంటుంది. హాలీవుడ్ లో తర్వాత వచ్చిన ది గ్రడ్జ్, డార్క్ వాటర్, పల్స్, వన్ మిస్డ్ కాల్ వంటి హార్రర్ చిత్రాలకు ఇదే ఇన్సిపిరేషన్.
ది గ్రడ్జ్ : 2004 లో అమెరికాలో వచ్చిన సూపర్ నేచురల్ హర్రర్ ఫిల్మ్. జు వన్ ది గ్రడ్జ్ అనే జపనీస్ చిత్రానికి ఇది అనువాదం. 2004 లో వచ్చిన ఈ చిత్రానికి మాతృక దర్శకత్వం వహించిన టకాషీ షిమిజు దర్శకత్వం వహించాడు. సారా మిచెల్ గెల్లార్, జాసన్ బెహర్, ప్రధాన తారాగణం. వివాహేతర సంబంధ అనుమానంతో తన భార్యా, పిల్లల్ని చంపిన తర్వాత భర్త కూడా అనుమానాదస్పద స్థితిలో చనిపోతాడు. అక్కడి నుంచి ఆ ఇంట్లోకి ఎవరొచ్చినా శాపగ్రస్తులై దారుణంగా హత్య గావించబడతారు. హర్రర్ మూవీస్ లో ఆల్ టైం లిస్ట్ లో దిగ్రడ్జ్ నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ది ఎక్సోర్ సిస్ట్ : 1973 లో వచ్చిన అమెరికన్ హర్రర్ మూవీ. విలియమ్ ఫ్రెడ్ కిన్ దర్శకత్వం వహించాడు. 1971 లో విలియమ్ పీటర్ రచించిన ది ఎక్సోర్ సిస్ట్ నవల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఎలెన్ బర్స్టైన్, మాక్స్ వోన్ సైడో, లీ కోబ్ తదితరులు ప్రధాన తారాగణం. ఇరాక్ కు చెందిన ఓ ఆర్కియాలజిస్ట్ తవ్వకాలలో అనుకోకుండా పాజుజు అనే ఓ శాపగ్రస్త విగ్రహాన్ని కదిలిస్తుంది. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమౌతుంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ ఆత్మ తరుముకుంటూ వచ్చి ఆమె వెంట ఉన్న వారిని చంపుతూ ఉంటుంది. ఈ చిత్రం ఇప్పటికీ అమెరికాలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది.
మరిన్ని ప్రత్యేక స్టోరీల కోసం నీహార్ ఆన్ లైన్ చూస్తూనే ఉండండి...