‘మల్లెపూవు’పై మనసు పారేసుకున్న సునీల్

February 10, 2015 | 04:51 PM | 49 Views
ప్రింట్ కామెంట్
sunil_mallepuvvu_niharonline

సునీల్ ను హీరో అనాలో కమెడియన్ అనాలో అర్థం కాని పరిస్థితి. ఈ విషయం మీద సునీల్ క్లారిటీ ఇస్తేనే బాగుంటుందేమో... అయితే ప్రస్తుతం ఆయన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. చాలా రోజుల గ్యాపే వచ్చినట్టుంది ఆయన సిల్వర్ స్క్రీన్ కు. ప్రస్తుతం వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ నటిస్తున్న సినిమా పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నాడు. గతంలో నాగచైతన్యతో ‘జోష్’ సినిమా తీసి ఫెయిల్ అయిన వాసు వర్మ సునీల్ కు హిట్ ఇవ్వాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇటీవలి వరకూ టైటిల్ నిర్ణయించలేదు. ఇప్పుడు ‘మల్లెపువ్వు’ అనే టైటిల్ ను అనుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది సీనియర్ నటుడు శోభన్ బాబు మ్యూజికల్ హిట్ మూవీ. సినిమా మాత్రం ఫ్లాపే. భూమిక కూడా ఇదే టైటిల్ తో ఓ సినిమాలో నటించింది. ఈ రెండు మల్లెపువ్వులు వాడిపోయినప్పటికీ తిరిగి మల్లెపూవు టైటిల్ ను ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికే కెరీర్ విషయంలో అయోమయంగా ఉన్న సునీల్ మళ్ళీ ఫ్లాప్ టైటిల్ ను ఎందుకు ఎంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వాసులు చర్చించుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ