గూగుల్ కిరీటం మరోసారి సెక్సీ క్వీన్ వశం

December 17, 2015 | 05:47 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Sunny_leone_google_most_searched_2015_Niharonline

ప్రతీ యేడులాగానే గూగుల్ ఈ యేడాదికి కూడా మోస్ట్ సెర్చింగ్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇక జాబితాలో శృంగార తార సన్నీలియోన్ ప్రధాని మోదీ లాంటి వారిని పక్కకి నెట్టేసి జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. హాట్‌గా హాట్‌గా కనిపిస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టిన ఈ శృంగార తార మోస్ట్ సెర్చింగ్ జాబితాలో నిలవటం పెద్ద విశేషమేమీ కాదు. కానీ, ఆ క్రమంలో ప్రధాని మోదీ, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం లాంటి వారిని వెనక్కినెట్టడం ఆశ్చర్యం కలిగించేదే. జిస్మ్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ 34 ఏళ్ల పోర్న్ స్టార్ ఆ క్రేజ్ మూలంగానే బాగా పాపులర్ అయ్యింది. ఇక జాబితాలో ఆమె తరువాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, షారూఖ్ ఖాన్, యోయో హనీ సింగ్, కాజల్ అగర్వాల్, అలియా భట్, నరేంద్ర మోదీ నిలవడం విశేషం.

                                           ఈ సంవత్సరంలో ఆమె పాపులర్ కావటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.  ఆ మధ్య ఆమె ఒక కండోమ్ యాడ్ లో నటించింది. అది కాస్త పొలిటికల్ టచ్ తీసుకుని దుమారం రేపింది. ఇలాంటి యాడ్ లు చేయటం వల్లనే దేశంలో రేప్ లు జరిగిపోతున్నాయంటూ ఓ పెద్దాయన వ్యాఖ్యానించటంతో సన్నీ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు ఓ మహిళ సన్నీలియోన్ తమ మొగుళ్లను తమకు కాకుండా చేస్తుందంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా వివాదాస్పద అంశాలతో సన్నీకి ఈ ఏడు బాగానే కలిసి వచ్చింది. మరోవైపు ఏక్ పహేలీ లీల, కుచ్ కుచ్ లోచాహై వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇక త్వరలో మస్తీ జాదే అంటూ ఓ అడల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైపోతుంది. ఆ చిత్ర పోస్టర్లు మరీ వల్గర్ గా ఉండటంతో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. వెరసి 2015 గూగుల్ కిరీటం ఆమెకు దక్కటానికి పైవన్నీ కారణాలు అయ్యాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ