సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వేర్వేరు బ్యాగ్రౌండ్ ల నుంచి వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో ఇంకోందరైతే అస్సలు సంబంధం లేని ఫీల్డ్ నుంచి వచ్చి వారి కఠోర శ్రమతో స్టార్ స్టేటస్ కి ఎదిగారు. అలాంటి వారిలో సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఒకరు. మొదట్లో బస్సు కండక్టర్ గా పనిచేసిన శివాజీ రాజ్ గైక్వాడ్ అలియాస్ రజనీ ఇప్పుడు అందనంతా ఎత్తుకి ఎదిగిపోయాడు. తమిళనాడుతోపాటు మిగతా రాష్ట్రాల్లో తలైవా కు ఉన్న అభిమాన గణం బహుశా ఇండియాలో ఏ హీరోకు ఉండరు కాబోలు. ఇక మరో స్టార్ విషయానికొస్తే ఇదే కోవలోకే చెందుతాడు బాలీవుడ్ స్టార్ హీరో కిలాడీ అక్షయ్ కుమార్. ఈయనగారు కెరీర్ మొదట్లో ఓ హోటళ్లో వెయిటర్ గా పని చేసి ఇప్పడు ఖాన్ ల తర్వాతి స్థానంలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక వీరిద్దరు కలిసి ఇండియాలో భారీ బడ్జెట్ మూవీగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రోబో-2 లో నటించబోతున్నారు.
అట్టహాసంగా రోబో-2 షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఇక ఇందులో రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పటిదాకా కీలకమైన విలన్ రోల్ కి హాలీవుడ్ నుంచి అర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్, ఈ మధ్యే బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ పేర్లు వినిపించాయి. కానీ, సస్పెన్స్ కి తెరదించుతు చివరికి అక్షయ్ కుమార్ ను ఫైనలైజ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించాడు కూడా. అందుకు సంబంధించి ఆ చిత్ర యూనిట్ మొత్తం ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సౌత్ సూపర్ స్టార్ రజనీ సార్ తో నటించే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు అక్కీ. మొత్తానికి కండక్టర్ వర్సెస్ వెయిటర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను సుమారు 300 కోట్ల బడ్జెట్ తో ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు శంకర్ పూర్తిస్థాయి విదేశీ పరిజ్ణానం వినియోగించనున్నట్లు సమాచారం.