ఈ మధ్య పేపర్లు, ఛానళ్ళు, సోషల్ నెట్ వర్కుల్లో ఎక్కడ చూసినా శృంగార తార సన్నీ లియోన్ గురించే. నలుగురి కలిసి మాట్లాడుకునే చోట మాటల్లో ఈవిడ టాపిక్ వచ్చిందంటే ఆ చాటింగ్ ఒక పట్టాన ముగియదు. గూగుల్ లో మోస్ట్ సెర్చ్ డ్ పర్సన్స్ లో ఈమె మొదటి స్థానం ఆక్రమించిందంటే ఈమెకు జనాల ఫాలోయింగ్ ఏ లెవెల్ లో ఉందో అర్థమవుతుంది. ఇంతలా ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఈవిడ ఇష్టపడే వారెవరు? అనే సందేహం కూడా చాలా మందికి కలుగుతుంది. అదే సన్నీ లియోన్‌ను అడిగితే... బాలీవుడ్ లో తనకు ఎక్కువగా స్ఫూర్తినిచ్చేది ప్రియాంకా చోప్రా అని అమ్మడు వెల్లడించింది. తన భర్త డానియెల్ వెబర్ తో కలిసి ఆమె ఓ పత్రిక కవర్ పేజీ ఆవిష్కరణకు వచ్చింది. అప్పుడే విలేకరులు ఆమెను హిందీ చిత్రరంగంలో ఏ నటి అంటే ఎక్కువ ఇష్టమని అడిగారు. నటన విషయాని కొస్తే అందరికంటే విద్యాబాలన్, కంగనా రనౌత్ అంటే తనకు ఎక్కువ ఇష్టమని, అయితే, అన్ని విషయాలూ తెలిసున్న ప్రియాంకా చోప్రా తనకు ఎక్కువ స్ఫూర్తినిస్తారని సన్నీ లియోన్ తెలిపింది. ఇక్కడ నేరుగా ఆమె నటించేటప్పుడు చూస్తుంటానని, అదే అమెరికా వెళ్తే అక్కడ ఆమె హోర్డింగులు కూడా కనపడతాయని వివరించింది. అలాంటప్పుడు తనకు చాలా గర్వంగా అనిపిస్తుందని, తాను కూడా ఆమెతో పాటే హిందీ సినిమా రంగంలో నటిస్తున్నందుకు ఎంతో గొప్పగా అనిపిస్తుందని సన్నీ చెప్పింది. తుషార్ కపూర్, వీర్ దాస్ నటిస్తున్న మస్తీజాదేలో ప్రస్తుతం సన్నీ నటిస్తోంది.