ఈ మధ్య సెలబ్రిటీల పేర్లతో ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి తప్పుదోవ పట్టిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువవుతోంది. తమిళ నటుడు సూర్య పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ అయి ఉండడంతో హీరో సూర్య ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ అకౌంట్ సూర్య అభిమానిది కావడం విశేషం. తన పేరుతో కొందరు నకిలీ ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారని, అవన్నీ ఫేక్ అని సూర్య కంప్లైంటులో పేర్కొన్నట్లు సమాచారం. ఆయన ఇంత వరకు వెబ్ పేజీ అకౌంట్ క్రియేట్ చేయలేదనీ, ఎవరో తన పేరును మిస్ యూజ్ చేసుకుంటున్నారని వివరించారు. నిజంగా సూర్య అకౌంట్ అనుకున్న అభిమానులు సూర్యపేరుతో ఉన్న ఆ అకౌంట్ కు మెసేజిలు పంపడం, సలహాలివ్వడం చేస్తుండడంతో... సూర్య రంగంలోకి దిగి కేసు పెట్టినట్టు తెలుస్తోంది. సూర్య త్వరలో సోషల్ నెట్ వర్క్ లో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. ఆ విషయాన్ని అధికారికంగా త్వరలోనే తెలియజేస్తానని సూర్య స్వయంగా చెప్పినట్టు తమిళ నాడులో వార్తలు వచ్చాయి.