నారా రోహిత్ పేరిట తమ్ముడి ఘరానా మోసం

February 08, 2016 | 11:20 AM | 8 Views
ప్రింట్ కామెంట్
TNSF-leader-saikrishna-cheats-Name-Hero-Nara-Rohit-fan-niharonline

కాల్ మనీ సెక్స్ రాకెట్ దందా రేపిన కలకలం మరిచిపోక ముందే ఏపీ రాజకీయ రాజధాని విజయవాడలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. టీడీపీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) నేత సాయికృష్ణ పలువురి నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డాడు. ఇందుకోసం అతగాడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడి సోదరుడు నారా రామ్మోహన్ నాయుడి కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ను వాడుకున్నాడు.  ఆయన సినిమాలను సాకుగా చూపిన సాయి పలువురి వద్ద కోట్లాది రూపాయలను తీసుకున్నాడు.

అయితే గడువు ముగిసినా, రుణం చెల్లించకపోవడంతో రుణ దాతలు అతడిని నిలదీశారు. ఈ నేపథ్యంలో డబ్బు కోసం వేధిస్తే కాల్ మనీ కింద కేసు పెడతానంటూ సాయికృష్ణ రుణ దాతలను బెదిరించాడట. దీంతో బెంబేలెత్తిపోయిన రుణ దాతలు అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాయికృష్ణ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.

మరోవైపు తన పేరు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సాయికృష్ణతో తనకెలాంటి సంబంధం లేదని నారా రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ఉదయం వార్తలు వచ్చిన వెంటనే నారా రోహిత్ చాలా వేగంగా స్పందించాడు. సాయికృష్ణ తనకు అభిమానిగానే తెలుసని ప్రకటించిన రోహిత్, అతడు చేసిన వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ