ఆ హీరోలిద్దరినీ ఒకే వేదికపై చూస్తే కన్నుల పండుగే... ఈ ఇద్దరూ సినిమా ఫంక్షన్ లకు దూరంగా ఉంటారు. ఈ మధ్యే అడపా దడపా కనిపిస్తున్నారు. కానీ స్టేజిలెక్కడమంటే బొత్తిగా నచ్చదు వీరికి. ఈ ఇద్దరి భావాలూ కలుస్తాయి. అందుకే జల్సాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు... పైరసీ గొడవలో మహేష్ కు పవన్ సపోర్ట్ గా మాట్లాడాడు. తరచూ కలుసుకోకపోయినా వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరిరువురికీ నచ్చిన డైరెక్టర్ అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఈ ఇద్దరితో చాలా సన్నిహితంగా ఉంటాడు. ఆ హీరోలతో సినిమాలు చేయడానికే ఇష్టపడుతుంటాడు. తన భావాలు, ఆలోచనలు పవన్, మహేష్ ల ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టే వారితో సినిమా చేయడం తనకు చాలా హాపీగా ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగానే చెప్పాడు త్రివిక్రమ్. అయితే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, ఈ ఇద్దరినీ ఒకే వేదికమీదకు త్రివిక్రమ్ రప్పించే ప్రయత్నం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అల్లుఅర్జున్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకకు పవన్ మహేష్ లను అతిధులుగా పిలిచి ఒక రికార్డు క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ‘మేముసైతం’ కార్యక్రమానికే రాని వీళ్ళు ఈ సినిమా ఆడియో వేడుకకు వస్తారా? అని కొందరి అనుమానం. నిజంగా ఈ ఇద్త్రిదరినీ త్రివిక్రమ్ రప్పించ గలిగితే మాత్రం ఈ సంవత్సరపు సినీ అద్భుతాల్లో ఇదీ ఒక అద్భుతంగా మిగిలిపోతుంది.