దేశంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏఐబీ రోస్ట్. బాలీవుడ్ స్టార్ల బూతు జోక్ లతో ఈ కార్యక్రమంపై విమర్శలు వెలువెత్తాయి. తాజాగా ఈ కార్యక్రమంలో అశ్లీలతకు తావిచ్చారంటూ 14 మంది బాలీవుడ్ స్టార్ల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చటం జరిగింది. వారిలో కరణ్ జోహార్, రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్, దీపికా పదుకునే, అలియా భట్ తదితరులు ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనాక్షి సిన్హా పేరును మాత్రం చేర్చలేదు. దీనిపై బాలీవుడ్ దర్శకుడు పోలీసులను ప్రశ్నిస్తున్నాడు. సోనాక్షి సిన్హా బీజేపీ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా కుమార్తె అయినందునే ఆమె పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని విమర్శించారు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆయన అంటున్నారు. అంతేనా సోనాక్షిని వదిలేసి తన కూతురు అలియా భట్ పేరును చేర్చారన్న బాధలోనే అలా మాట్లాడారా?