ఆగస్టు మూడు నుంచి టీవీ సిబ్బంది సమ్మె

July 30, 2015 | 04:37 PM | 2 Views
ప్రింట్ కామెంట్
TV_Serials_strike_niharonline

టీవీ సీరియల్స్ మొదలవ్వడమే తరువాయి టీవీలకు అతుక్కుపోయే జనాలకు ఓ బ్యాడ్ న్యూస్... 
తెలుగు టీవీ ఛానళ్ళలో సీరియల్స్ ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీవీ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ సహాయని రాకరణ బాట పట్టబోతోంది. చాలా రోజులుగా తమ వేతనాలు పెంచాలంటూ టెలివిజన్ టెక్నిషియన్స్ అండ్ ఫెడరేషన్ ఆగస్టు 3వ తేది నుంచి షూటింగ్‌కు వెళ్లబోమని ప్రకటించింది. టీవీ ఫెడరేషన్‌లోని అనుబంధ సంఘాల కార్మికులు, సాంకేతిక నిపుణుల వేతనాలు పెంచాలంటూ 'తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్'ను పలుమార్లు కోరినా ఫలితం లేకపోవడంతో ఆగస్టు 3 నుంచి సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించింది. వేతనాలతోపాటు తమకు పనిచేసే వేళలు నిర్ణయించాలని టీవీ ఫెడరేషన్ కోరుతూ వస్తోంది. తమ విన్నపాలకు ఎలాంటి స్పందన కనిపించకపోడంతో ఇక నిరసనకు దిగుతున్నామని టీవీ ఫెడరేషన్‌లోని 14 శాఖల కార్మికులు యోచిస్తున్నారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో టీవీ ఫెడరేషన్‌లోని అన్ని శాఖల కార్మికులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ ఆండ్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మెన్ మేచినేని శ్రీనివాస రావు.. టీవీ కార్మికులకు 20 ఏళ్ల నుంచి వేతన సవరణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు కూలీ వేతనం కంటే తక్కువ ఉందన్నారు. సరైన టైమింగ్ లేదని, కార్మికులు రోజుకు 16 నుంచి 18 గంటల పాటు పని చేస్తున్నారని తెలిపారు. డబ్బింగ్ సీరియళ్ళ వల్ల, పర భాషా ఆర్టిస్టుల వల్ల తమ జీవన ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నిజానికి ఈ 14 శాఖల కార్మికులు సమ్మె చేస్తే వారం రోజుల్లోపే టీవీ సీరియళ్ళు, ఇతర ప్రోగ్రాములు కూడా ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ