వరుస ఫ్లాపులతో ఐరెన్ లెగ్ గా ముద్రపడిన మిల్కీ బ్యూటీ తమన్నాకి బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో పెద్ద ఒరిగిందేం లేదనే చెప్పాలి. నిజానికి మధ్య మధ్యలో ఒకటి రెండు హిట్లు తప్పా తమన్నా టాలీవుడ్ కెరీర్ అంత సజావుగా సాగిందనే చెప్పాలి. మాగ్జిమమ్ అందాల ఆరబోతకు ఎప్పుడూ ముందుండే ఈ బ్యూటీకి అవకాశాలు కూడా ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి.
చలో బాలీవుడ్ అంటూ ఆ మధ్య జంప్ అయినా అక్కడ అట్టర్ ఫ్లాపులు వెల్ కమ్ చెప్పటంతో ఫీచే ముడ్ అంటూ మళ్లీ సౌత్ కి వచ్చేసింది. నిన్నగాక మొన్న తమిళ్ లో ఆర్యతో జంటగా వాసుమ్ శరవణమ్ ఓన్న పుదిచవంగ తో హిట్ అందుకున్న తమ్మూ ఇప్పుడు తిరిగి తెలుగులోనూ ఓ హిట్ కావాలంటూ ఎదురుచూస్తుంది. ఇన్నాళ్లు కుర్రహీరోలతో కానిచ్చిన తమన్నా ఇప్పుడు రవితేజ లాంటి సీనియర్ హీరోతోనూ బెంగాల్ టైగర్ లో తెగ రొమాన్స్ చేసింది.
ఈ రోజు విడుదలైన టీజర్ లో కొన్ని సెకన్లు ఓ పాటకు సంబంధించిన దృశ్యాలను విడుదల చేశారు. ఇందులో తమ్మూ హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో ఆకట్టుకుంది. తెల్ల చీరలో మల్లెపువ్వులా మెలికలు తిరుగుతూ అందాలు ఆరబోసింది. రచ్చ సినిమాలో వానా వానా తరహాలోనే ఈ పాట చిత్రీకరించినట్లు అర్థమౌతోంది. ఇక కుర్రకారు మిల్కీ బ్యూటీ అందాలను తెరపై చూసి ఆస్వాదించటమే తరువాయి.