గత ఏడాది ఆస్కార్ పోటీకి నామినేట్ అయిన ‘మిణుగురులు’ చిత్ర రచయిత ఎన్వీబీ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కీచక. ఈ చిత్రంలో 15 రేప్ సీన్లు చూపించడంతో ఈ చిత్రం ప్రివ్యూ చూసిన కొందరు చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని ఆశ్చర్యపోయారట. కానీ ఈ చిత్రం సందేశాన్ని అందించేదిగా ఉందని సెన్సార్ భావించడంతో దీనికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. నాగపూర్‌లో సుమారు 300 మంది మహిళలను, యువతులను రేప్ చేసినట్టు చెబుతున్న ఓ కిరాతకుని యదార్థ గాథ ఆధారంగా ఈ మూవీ తీశారని తెలుస్తోంది. కీచక చిత్రంలో సాంకేతిక విలువలు బాగున్నాయని, నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సంతృప్తికరంగా ఉందని చెబుతున్నారు. ఇందులో రేప్ సీన్లతో పాటు హింసాత్మకం కూడా కొంత ఉందని చెబుతున్నారు.