సీనియర్ హీరో కమల్ హాసన్ కూతుళ్లు శ్రుతి, అక్షరలు సినిమాల ద్వారానే కాదు, పర్సనల్ వ్యవహారాల ద్వారా కూడా బాగానే పాపులర్ అవుతున్నారు. పెద్ద కూతురు శ్రుతిహాసన్ సినిమాల్లోకి వచ్చిన మొదట్లోనే నటుడు సిద్ధార్థ్ తో డేటింగ్ వ్యవహారం నడిపి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత అది బ్రేకప్ అయ్యిందనుకోండి. ఆదెబ్బకి శృతి మళ్లీ ఎప్పుడూ ప్రేమ జోలికిపోకుండా గప్ చుప్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇక ఇప్పుడు చిన్న కూతురు అక్షర హాసన్ కి ప్రేమ దోమ కుట్టిందట. సీనియర్ నటి అయిన రతి అగ్నిహోత్రి కొడుకు తనుజ్ విర్వానితో అక్షర డేటింగ్ చేస్తోందంటూ చాలా కాలంగా గాసిప్ వినిపిస్తోంది. ఆ మధ్య తనుజ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో అక్షర పాల్గొంది. ఇద్దరు చాలా సన్నిహితంగా ఫోటోలు కూడా దిగారు. దీంతో వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు మీడియా దృవీకరించుకుంది.
అయితే తాజాగా ఈ వార్తలు బాగా హైలెట్ అవుతుండటంతో ఎట్టకేలకు తనుజ్ స్పందించాడు. అసలు ఆకర్ష్ తో తాను డేటింగ్ చేయడమేంటని చెప్పుకొచ్చాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. డేటింగ్ చేస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుని రాసేయకండి అంటూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశాడు. అసలు 'మేము ఎటువంటి వారిమో, మా మధ్య సంబంధమేంటో మా పేరెంట్స్‌కి తెలుసం'టూ కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. అన్నట్లు ఇతని గారి అమ్మ అయిన రతి, అక్షర తండ్రి కమల్ హాసన్ ఏక్ దుజే కే లియే (మరో చరిత్ర హిందీ రీమేక్) హిట్ చిత్రంలో నటించారు కూడా.