హిందీ సినిమాల్లో బిజీ అయిన తాప్సి కాస్త ఓపెన్ గానే మాట్లాడినా, మాట వెనుక నిజాయితీ, డేరింగ్ మాట వెనుక కాస్త డిసిప్లిన్ ఉన్నట్టే కనిపిస్తుంది. తాజాగా ఈమె హీరోయిన్ల డేటింగ్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడేసింది ఓ ఇంటర్వ్యూలో. విలేకరులు అడగమూ అలానే ఉంది, వాళ్ళను నొప్పించొద్దు కాబట్టి హీరోయిన్లు కూడా డేర్ గానే సమాధానం చెప్పేస్తున్నారు. ఈ డేటింగ్ విషయంలో ఇలియానా చాలా పచ్చి పచ్చిగా అన్నీ విప్పి ఎన్నో కబుర్లు చెప్పేస్తోంది. కాజల్ మాత్రం నన్ను వదిలెయ్యండి బాబూ అంటూ మెల్లగా జారుకుంది. ఇదే ప్రశ్న తాప్సీ దగ్గర వేస్తే ఆమె భయపడకుండా సమాధానం చెప్పేసిందట. హిందీలో బిజీ అయిపోయిన తాప్సీ ఏ సిక్కుతోనూ డేటింగ్ చేయనని స్పష్టం చేసింది. తాప్సీ తండ్రి ఓ సిక్కు అయినప్పటికీ తన తండ్రి మినహా తాప్సీకి ఏ సిక్కూ నచ్చడట. నటులతోనూ డేటింగ్ చేయదట. పెళ్ళికి కూడా సిక్కు-సినిమా వాసనలు వద్దట. మరి ఈ ముద్దు గుమ్మకు ఎవరు నచ్చుతారన్నట్టూ?