ఏమిటో హీరోయిన్లే కాదు... తల్లులూ ఇలా మారిపోతున్నారేంటి? ఇప్పుడు వీరికీ డిమాండ్ బాగానే ఉందన్నమాట. ఒకప్పుడు అవకాశాలు జారిపోయి తల్లులుగా మారిపోతే... ఇప్పుడు తల్లులూ, అత్తలూ మేమేం తీసుపోం అంటున్నట్టున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఇప్పుడు తల్లి మారిపోయిందండీ గ్రేసీ సింగ్ ను అనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ మొత్తంలో అడగడంతో ఆ తల్లి స్థాననిన మార్చేసి ఇప్పుడు సుకన్యను తీసుకువచ్చేశారు. ఇప్పుడు ఈమె జగపతిబాబుకు భార్యగా, మహేష్ కు తల్లిగా నటిస్తోందట. ఇక్కడో విశేషం చెప్పుకోవాలి. ’పెద్దరికం‘ సినిమాలో ఇదే జంట ప్రేమ జంటగా నటిస్తే, ఇప్పుడు తల్లిదండ్రులుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తల్లిపాత్ర కీలకమైనదని మొదటినుంచీ చెపుతున్నారు. అంత కీలకమైన పాత్రకు మొదట శ్రీదేవి అనీ, తరువాత నదియా, గ్రేసీ సింగ్ చివరికి సుకన్య. మరి ఇప్పటికైనా మహేష్ తల్లిగా సుకన్య ఫిక్స్ అయినట్టేనా?