రాజా చెయ్యితో తారక్ ఫేట్ మారేనా?

February 22, 2016 | 12:49 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tarak-Ratna-Look-in-Raja-Cheyyi-Vesthe-Movie-impressive

తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావటం రావటమే ఓ రికార్డు క్రియేట్ చేశాడీ నందమూరి వారసుడు. ఒకేసారి తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవంతో అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు తారకరత్న. కానీ ఆ తొమ్మిదిలో నాలుగో ఐదో మాత్రమే పూర్తయి విడుదలయ్యాయి. అవి ఆడలేదు. మిగతావి మొదలే కాలేదు. మధ్యలో వేరే సినిమాలు కొన్ని చేశాడు ఫ్చ్... అవీ ఫట్టే.  ఓ దశలో ఇండస్ట్రీలో అతన్ని లైట్ తీస్కోవటం మొదలుపెట్టారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ కొన్ని అవకాశాలు దక్కించుకున్నాడు.

                     అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ గా అంతర్థానం అవుతాడు అనుకుంటున్న టైంలో చిత్రమైన జోనర్ సినిమాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడీ నందమూరి హీరో. టోటల్ గా లుక్ ను మార్చేసుకుని రాబోతున్నాడు. నారా రోహిత్ అప్ కమింగ్ మూవీ రాజా చేయి వేస్తే లో నందమూరి తారకరత్న ఓ కీలకపాత్ర పోషించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన స్టిల్ ను తారకరత్న పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. దీనిని పరిశీలిస్తే చాలా భిన్నమైన క్యారెక్టర్ ను పోషించినట్లుగా తారకరత్న లుక్ చూస్తేనే అర్థమవుతుంది. నారా వారబ్బాయి సినిమాతోనైనా ఈ నందమూరి వారసుడి దశ తిరగాలని కొరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్ డే తారక్.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ