నందమూరి హీరోల మూడు సినిమాలు ఒకదాని తరువాత ఒకటి ప్రేక్షకులను ఎంత మేరకు అలరిస్తాయనే దానిపైనే ఇప్పుడు సినిమా వాళ్ళలో, అభిమానుల్లో నలుగుతున్న చర్చ. నందమూరి హీరోలు ముగ్గురు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2015 నందమూరి వారిదవుతుందని. అన్నట్టుగానే కళ్యాణ్ రామ్ సినిమా హిట్ లిస్టులో చేరిపోయింది. ఇక టెంపర్, లయన్ మిగిలి ఉన్నాయి. బుధవారం జరిగిన టెంపర్ ఆడియో ఫంక్షన్ లో విడుదలైన ట్రైలర్ చూస్తే ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా హిట్ లిస్టులో చేరిపోయినట్టే అనిపిస్తుంది. ‘‘అరే లోపల నా ఇగో హర్ట్ అవుద్ది....’’ అన్న ప్రకాష్ రాజ్ డైలాగుకు ‘‘నీకు ఇగో లోపల ఉంటదేమో.... నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అన్న డైలాగుతో ఆడియో ఫంక్షన్ హాల్ దద్ధరిల్లిపోయేలా కేకలు పెట్టారు అభిమానులు... ’నా పేరు దయ నాకు లేనిదే అది’ ఎన్టీఆర్ ఇలా రఫ్ గా నిర్లక్ష్యంగా మాట్లాడ్డం గతంలో ఏ సినిమాలోనూ చూడలేదు ఆడియన్స్... హీరో డైలాగుల్లో కాస్త విలన్ టచ్ కనిపిస్తుంది. ‘‘సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్. డిపార్ మెంట్ పరువు తీయడానికి పుట్టా... ఫుల్లీ కరెప్టెడ్... క్రిమినల్ మైండెడ్...హండ్రెడ్ పర్సంట్ కన్నింగ్’’ అంటూ మరో డైలాగు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు విలన్ల పని పట్టాలంటే విలనిజమే కరెక్ట్ అన్నట్టుగా ఉన్నాయి ఎన్టీఆర్ డైలాగ్స్. అందుకే పూరీ జగన్నాథ్ తన స్పీచ్ లో ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లలోనూ ఎన్టీఆర్ కనిపిస్తాడని చెప్పారు. ‘‘వీడు నాకన్నా వరస్ట్ గా ఉన్నాడేంట్రా....’’ అంటే విలన్ కే విలన్ గా కనిపించాడంటే పూరీ చెప్పినట్టుగా ఇందులో ఎన్టీఆర్ బాడీలాంగ్వేజ్ అంతా మారిపోయినట్టే ఉంది మరి. ఇక ఇందులోని పాటా అంతే... ’’నేను పనికిమాలిన యెదవ హే భగవాన్...’’ అన్న ఒక పాట... హాట్ గా మరోటి ’’వయసులోనే ఉన్నదమ్మో బెండు తీసే టెంపరూ...’’ ఇవి రెండు మాస్ మెచ్చే పాటలు. ’’ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం... అదే ఒకడు మీదడిపోతే.... దండ యాత్ర.... ఇది దయాగాడి దండ యత్ర’’ అంటూ మొదట విడుదలైన టీజర్ లో కనిపిస్తుంది మరో పవర్ ఫుల్ డైలాగ్. హీరో ప్లస్ విలనిజం చూపిస్తున్నట్టున్న ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కాజల్ దగ్గరకు వచ్చేసరికి హాట్ హాట్ గా మారిపోతాడు... ఆ డైలాగులూ డిఫరెంట్... బాడీ లాంగ్వజీ డిఫరెంట్... ఏ సినిమాలోనూ ఎన్టీఆర్ ఇలా కనిపించడు, కాజల్ కూడా ఇంత హాట్ గా ఏ సినిమాలో చూసి ఉండం... కాజల్ పోస్టర్లు కూడా కుర్రకారు మతులు పోగొట్టేలా ఉన్నాయి. టోటల్ గా టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక రేంజ్ కు తీసుకువెళ్ళే చిత్రంగా నిలిచిపోతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదనిపిస్తుంది.