టాలీవుడ్ నటుడు సుమన్ దర్శకుడు గుణశేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది. రుద్రమదేవి చిత్రంలో నటించేందుకు గుణశేఖర్ ఇచ్చిన రూ.5 లక్షల చెక్కు బౌన్స్ అయిందని, దానిపై గుణశేఖర్ ను అడిగినా స్పందించకపోవటంతో పోలీసులను ఆశ్రయించానని సుమన్ తెలిపారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు గుణశేఖర్ నిరాకరించారు. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిస్తున్న రుద్రమదేవి సినిమాకు దర్శకుడు, నిర్మాత గుణశేఖరే.